4news HD TV

CINEMANational

ఆగిపోయిన బాలయ్య – బోయపాటి సినిమా?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తోందంటూ కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్ చల్ చేస్తోంది. ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో సినిమా తీసి విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ సినిమాకు పార్ట్-2 అనుకున్నారు. హిట్ కాంబినేషన్ కావడంతో నిర్మాతలు కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయడానికి పోటీపడ్డారు. అయితే తాజాగా ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా తీస్తే…

POLITICSTechnology

అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?

బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్…

TELANGANA

30 సంవత్సరాల తర్వాత శని శశ రాజయోగం

శనిదేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలితాలను నిర్థారిస్తాడు. శని రాశుల్లో సంచరించడంవల్ల అన్ని రాశులవారిపై ప్రభావం ఉంటుంది. ఈ నెలలో 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమిస్తుంది. రాత్రి 10:48 గంటలకు సంచారం ఉంటుంది. ఇది శుభ సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల శని శశ రాజయోగం ఏర్పడుతుందని, అన్ని రాశులవారికి మిశ్రమ ఫలితాలుంటాయని వెల్లడించారు. ఏయే రాశులవారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయో తెలుసుకుందాం. సింహ రాశి : 30 సంవత్సరాల తర్వాత శని…

National

చంద్రబాబుకు తాత్కాలిక ఊరట ! లింగమనేని ఇంటి జప్తుపై తేల్చని ఏసీబీ కోర్టు ?

ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఇల్లు అటాచ్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ప్రకటిస్తుందని ఆశించినా కోర్టు మాత్రం మళ్లీ వాయిదా వేసింది. చంద్రబాబు…

National

షాకింగ్ వీడియో: మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి మృతి

హైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలా మంది లిక్కర్ సేవించకుండా ఉండలేరు. పరిమితికి మించి తాగితే ఎన్నో అనర్థాలు తప్పవని తెలిసినా.. మద్యానికి బానిసగా మారి తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న భూక్యా అశోక్..…

CINEMANational

మొదటి స్థానంలో ప్రభాస్.!. రెండో స్థానంలో చినజీయరు!!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి ఆదిపురుష్ పైనే ఉంది. సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ప్రభాస్ రాముడిగా నటించడం. ఈనెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మొదటిసారి టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ట్రైలర్ తో సినిమా యూనిట్ నెగెటివిటీని తగ్గించగలిగింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ వస్తోంది. చిత్ర యూనిట్ ఈ హైప్…

National

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా…

TELANGANA

రహస్య ఒప్పందాలపై బిజెపి నోరు విప్పాలి: షర్మిల

హైదరాబాద్: రహస్య రాజకీయ ఒప్పందాలు ఎ పార్టీతో కుదుర్చుకున్నదో బిజెపి ప్రజలకు నోరు విప్పి చెప్పాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఇంతకు మీరు నడిపే రహస్య దోస్తానా.. ప్రీ పోల్ ఒప్పందమా.. పోస్ట్ పోల్ ఒప్పందమా.. అని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు తెలపడమే బిజెపి రహస్య ఒప్పందమా అని ప్రశ్నించారు. తక్షణం బిజెపి నోరు విప్పాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల ఈ మేరకు ఒక…

National

పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి

కూసుమంచి: పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కందాళ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాలేరు గ్రామంలోని బివి.రెడ్డి పంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ…

National

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టరు గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సంధర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి జూన్…