editor

National

లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం

భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం…

AP

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాట..

ఇద్దరూ అధికార పార్టీ నేతలే.. ఒకరు సీఎం జగన్ తొలి కెబినేట్‌లో మంత్రిగా పని చేశారు. మరొకరు సీనియర్ శాసనసభ్యులు. ఈ ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు.. సవాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక స్టేజిలో ఇద్దరు గల్లాలు పట్టకునే వరకు వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. వీరిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత..…

NationalTELANGANA

ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ (Sri Sri Ravishankar)కు చెందిన హెలికాప్టర్ తమిళనాడులోని ఈరోడ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేశారు. ఈ చాపర్‌లో శ్రీశ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన హెలికాప్టర్‌ను ఉదయం 10.40…

AP

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష

  25.01.2023 బుధవారం, ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ- ఏఐటియూసి సంయుక్తంగా నిరసన దీక్ష కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమని, ఈపరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా కూర్చుందని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తిరుమలకుంట,రెడ్డిగూడెం పిఎస్134, నందు విద్యార్థులతో ముగ్గులు వేయించి ప్రతిజ్ఞలు చేయించి ముగ్గులేసిన విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎల్ఓఎస్ రాము అంగన్వాడి టీచర్ పల్లెల సత్యవతి తిరుమలకుంట పీఎస్ లో బిఎల్వోలు వాణి శ్రీనివాస పంచాయతీ సెక్రెటరీ నాగేశ్వరరావు వీఆర్ఏ రాము స్కూల్ హెచ్ఎం గారు వసంత మేడం మామిళ్లవారిగూడెం జిపిబిఎల్వో బుజ్జి పంచాయతీ సెక్రెటరీ రమేష్…

TELANGANA

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఓటు హక్కు అవసరంపై అవగాహన.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు రెడ్డిగూడెం పిఎస్134, నందు జాతీయ ఓటర్లు దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్కూల్ ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) వసంత మరియు విఆర్ఏ రాము పాల్గొని ప్రసంగించారు. ప్రతీ ఏడాది జనవరి 25వ తేదీన ఇండియాలో జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటుంటామని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించడమే జాతీయ…

NationalTELANGANA

బీబీసీ డాక్యుమెంటరీపై రాహుల్ గాంధీ కామెంట్స్

2002 నాటి గుజరాత్ అల్లర్లపై (Gujarat 2002 riots) బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా జమ్మూలో…

CINEMA

మంచు ఫ్యామిలీ మీద దారుణమైన కౌంటర్ వేసిన చిరంజీవి.

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి అస్సలు పడట్లేదు. ముఖ్యంగా మా అసోసియేషన్‌ ఎలక్షన్ల నుంచే ఈ రెండు ఫ్యామిలీల నడుమ దారుణంగా వార్‌ నడుస్తోంది. కాగా అప్పటి నుంచే మంచు ఫ్యామిలీ మీద కూడా దారుణంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. ఒక రకంగా ఈ ట్రోల్స్‌కు కారణం మెగా ఫ్యామిలీ అంటూ మంచు ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరు ఇన్‌ డైరెక్టుగా కౌంటర్ వేశాడని అంటున్నారు. తాజాగా ఆయన నటించిన మూవీ…

NationalTELANGANA

మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోషల్ మీడియా, మీడియా వేదికలపై ఆంక్షలు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్షలతో డాక్యుమెంటరీని భారత ప్రజలు చూడలేకపోయారు. కేరళలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్రయత్నం చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేయాలని…

National

మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర సందర్భంగా సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు. ఆ రోజున జరిగిన సర్టికల్ స్ట్రైక్ (Surgical strike)సరే, భారత సైన్యంలోని 19 మంది చనిపోయిన విషయం ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లోనూ దిగ్విజయ్ సింగ్ ఇదే వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యల మీద ఉన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందించారు. భారత జవాన్లను…