editor

APPOLITICSTELANGANA

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్

టీఆర్ఎస్ పార్టీకి, వైఎస్సార్సీపీకి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా కవిత ‘కమలం వదిలిన బాణం’ అంటూ షర్మిలపై ఆసక్తికర ట్వీట్ చేసింది. దీనికి కౌంటర్ గా షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో మంగళవారం షర్మిల ప్రగతి భవన్ ను ముట్టడించి, అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ…

AP

చంద్రబాబు రోడ్ షో సూపర్ హిట్

ఉభయ గోదావరి జిల్లా ప్రజల నాడి రాజ్యాధికారాన్ని నిర్ణయిస్తుందని రాజకీయ నానుడి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎటు వైపు ఉంటే ఆ పార్టీకి అధికారం ఖాయమని చాలా సందర్భాల్లో ప్రూ అయింది. 2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్వీప్ చేసింది. ఇప్పుడు కూడా అలాంటి స్పందన జనం నుంచి ఉందని టీడీపీ నేతలు విశ్వసిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు గోదావరి జిల్లాలకు వెళ్లిన చంద్రబాబు తొలి రోజు ఏలూరు జిల్లాలో…

CINEMA

త్వరగా కోలుకోవాలని షాకింగ్ నిర్ణయం : సమంత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతమైన హీరోయిన్లలో సమంత (SAMANTHA)కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దశాబ్ద కాలం నుంచి ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు కానీ సమంత అందం,నటనలో ఏ మాత్రం తగ్గుదలలేదని చెప్పవచ్చు. అలాంటి సమంత ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఎంత ఎదిగిన ఎంత బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎప్పుడు సోషల్ మీడియా…

TELANGANA

మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడి

ఇప్పటికే వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) తెలిపారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే లా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో 16,940 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్ చెప్పారు. ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సీఎం…

APPOLITICSTELANGANA

YS షర్మిలకి బెయిల్.!

ఉదయం నుంచీ హైడ్రామా నడిచింది. వైఎస్ షర్మిల, పోలీసుల కంట పడకుండా సొంత వాహనంలో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్ళగా, అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. వాహనం దిగేందుకు నిరాకరించిన షర్మిలను, వాహనంతో సహా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సాయంత్రం వైఎస్ షర్మిల సహా, ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు న్యాయస్థానం యెదుట హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నాంపల్లి కోర్టు, వైఎస్ షర్మిల సహా ఇతర నిందితులకు…

National

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు అంతా రెడీ

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మాజీ మంత్రి పరుషోత్తమ్‌ సోలంకి, ఆప్‌ సీఎం అభ్యర్థి ఈశుదాన్ గఢ్వి, ఆప్ గుజరాత్ చీఫ్‌ గోపాల్ ఇటాలియా, మోర్బీ నుంచి కాంతిలాల్‌ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఫస్ట్ ఫేజ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీషా సొంత రాష్ట్రం గుజరాత్‌లో.. వరుసగా ఏడోసారి కాషాయ జెండా రెపరెపలాడించాలని ఉవ్విళూరుతోంది బీజేపీ. అభివృద్ధి అజెండాతో ప్రచారం…

TELANGANA

రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు 31కి.మీ. మెట్రో కారిడార్‌

హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్‌ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. రెండో దశలో రాయదుర్గం-శంషాబాద్ విమానాశ్రయం వరకు 31కి.మీ. మెట్రో కారిడార్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిలో భాగంగా విమానాశ్రయం సమీపంలో 2.5 కి.మీ. అండర్‌ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు చెప్పారు. ఫేజ్-2 పనులకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మంగళవారం శంషాబాద్‌లోని మెట్రో స్టేషన్‌ను నేరుగా…

APPOLITICSTELANGANA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ట్వీట్ చేస్తూ సొంత బాబాయ్ కేసును ఇతర రాష్ట్రానికి వెళ్లడం సిగ్గచేటని అన్నారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మృతుడి కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు…

APPOLITICSTELANGANA

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై దాడి జరిగింది. నర్సంపేటలో వైఎస్ షర్మిల పాదయాత్ర జరుగుతుండగా, పాదయాత్రపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం ఇరు వర్గాలూ దాడులు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. వైఎస్ షర్మిల పాదయాత్ర వెంట వచ్చిన, బస్సుని కూడా తగలబెట్టారు ఆందోళనకారులు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. పదే…

NationalWorld

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు పై కేరళలో ఆందోళనలు

అదానీ గ్రూప్ నిర్మిస్తున్న విజిన్‍జమ్ పోర్టు(Vizhinjam Port) పై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ట్రాన్స్ షిప్‍మెంట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ వేలాది మంది ప్రజలు.. కేరళలోని విజిన్‍జమ్ పోలీస్ స్టేషన్‍ (Vizhinjam Police Station) ను ముట్టడించారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టేషన్‍పై దాడి చేశారు. దీంతో…