editor

CINEMA

గేమ్ చెంజర్ గా చెర్రీ

రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా మూవీకి సంబంధించి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. మొన్నటి వరకు ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాకు ‘గేమ్‌ చేంజర్‌’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే మొదట టైటిల్‌ను మాత్రమే విడుదల చేసింది చిత్ర యూనిట్‌. టైటిల్‌ను రివీల్‌ చేస్తూ ఓ చిన్న వీడియోను…

AP

తిరుమలలో భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు….

తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. రాబోయే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్ధం అలిపిరి మార్గంలో 10వేలు,శ్రీవారీ మెట్టు మార్గంలో 5వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తాం..రాబోవు మూడు నెలలు పాటు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం వుంది..వేసవి రద్దీ నేపథ్యంలో మూడు నెలలు పాటు ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను…

AP

ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందంతో సీఎం జగన్ భేటీ..

ముఖ్యమంత్రి జగన్ తో ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ Auguste Tano Koume నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచబ్యాంకు భారత్‌ విభాగానికి డైరెక్టర్ Auguste Tano Koume మాట్లాడుతూ.. ఏపీ రావడం…

AP

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు..

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చామని శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు తెలిపారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్నారు సీఎం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు సీఎం. ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు…

AP

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు లో సీబీఐని నిలదీసిన సుప్రీం….

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సీబీఐని నిలదీసిన సుప్రీం.. విచారణ అధికారిని మార్చాలని పేర్కొంది. ఇంకా విచారణ త్వరగా ముగించలేకపోతే మరో దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సీబీఐని సుప్రీంకోర్డు ధర్మాసనం ప్రశ్నించింది. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా…

TELANGANA

తెలంగాణలో రద్దయిన పరీక్షల కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది..

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్‌ 11గా నిర్ణయించింది. రద్దైన ఇతర పరీక్షలు ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలతోపాటు వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి…

AP

ఏపీలో ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌ సూచించారు. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ ఎడ్‌సెట్‌ ప్రవేశాలను నిర్వహిస్తోంది.   దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.…

SPORTS

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర..

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. వియత్నాంకు చెందిన థామ్‌ గుయేన్‌ను నిఖిత్ 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తనపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ప్రత్యర్థికి ఇవ్వలేదు. రెండో రౌండ్‌లో వియత్నాం బాక్సర్ కాస్త పుంజుకుంది కానీ, మూడో…

CINEMA

మహేష్ బాబు,త్రివిక్రమ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో SSMB28 చేస్తున్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ సడెన్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే నాగవంశీ ఈ సినిమాను సంబందించిన అప్డేట్ వస్తుంది అని, మహేష్…

AP

విశాఖలో జీ 20 సదస్సు అన్ని ఏర్పాట్లు పూర్తి..

జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు ఏపీ మంత్రులు. సదస్సు కోసం స్టీల్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కేవలం సుందరీకరణే కాకుండా శాశ్వత నిర్వహణకు చర్యలు చేపట్టామని వివరించారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధానికి తగ్గట్లు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు.. కొత్తగా 5 బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. G -20 ఏర్పాట్లపై…