National

APNationalTELANGANA

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు..

తన పార్లమెంట్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడంపై కాంగ్రెస్ ముఖ్య నేత, రాహుల్ గాంధీ స్పందించారు. చాలా ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దేశం కోసం గళం విప్పుతానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తాను భారతదేశ స్వరం వినిపించేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎందాకైనా పోరాడేందుకు సిద్ధం అని ప్రకటించారు రాహుల్. దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. మరోవైపు ప్రముఖ రాజకీయ నేతలు రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ సీఎం…

APNationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన కవిత ఈడీ విచారణ…దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే అంటూ ఉదయం మీడియాకు ప్రదర్శించారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు. కాగా, ఇవాళ రాత్రి వరకు విచారణ జరగడంతో క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మళ్లీ ఎప్పుడు…

National

పంజాబ్ లో హై అలర్ట్…

పంజాబ్ లో హై అలర్ట్ నెలకొంది. పంజాబ్ వ్యాప్తంగా పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ నేత అమృత్ పాల్ సింగ్ కోసం విస్తృతంగా వెతుకుతున్నారు. అతడిని పట్టుకునేందుకు నిన్న పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించింది. నిన్న దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పటు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెర్ సర్వీసులను షట్ డౌన్ చేశారు. అమృత్ పాల్…

APHealthNationalTELANGANA

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల…

దేశంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. 126 రోజలు తర్వాత శనివారం కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. శనివారం ఏకంగా 800 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా కరోనా వేరియంట్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. భారతదేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ XBB1.16 కేసుల సంఖ్య 76 నమోదు అయ్యాయని INSACOG డేటా వెల్లడించింది. XBB 1.16 వేరియంట్ మొదటిసారి జనవరిలో కనుగొనబడింది. ఫిబ్రవరి నెలలో 59…

NationalTELANGANA

తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు..

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని,…

APNational

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చ….

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. సీఎం జగన్‌కు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. మేరకు విజ్ఞాపన పత్రం అందించారు సీఎం జగన్.

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు. ఈడీ కోరిన సమాచారాన్ని న్యాయవాదితో పంపారు. అనారోగ్యం కారణంగా చూపుతూ.. మరో తేదీన తాను విచారణకు హాజరువతానని చెప్పినట్లు తెలుస్తోంది.

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని కొత్త ట్విస్ట్..

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను వ్యక్తిగత కారణాలతోనే ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు రాణా. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి కీలక విచారణలు జరుగుతున్న ఈ సమయంలో..నితీష్‌ రాణా ఈడీ పబ్లిక్‌…

APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో…

NationalSPORTS

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టులో టాస్‌ వేయనున్న ప్రధాని మోదీ…

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది.. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపుకోసం ఇరుజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఇవాళ జరుగనున్న ఈ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే..ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోదీతో పాటు..ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ హాజరుకానున్నారు. వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ టాస్‌ ప్రధాని మోదీ వేయనున్నారు.…