TELANGANA

TELANGANA

కవిత కేసులో కీలక మలుపు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటోన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. మరిన్ని రోజుల పాటు ఆమె కస్టడీలోనే ఉండనున్నారు.   నిజానికి- కవిత కస్టడీ నేటితో ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను అధికారులు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని, మరింత…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు….

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ పౌరుడికి సుపరిచితమైన పేరు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే టీఆర్ఎస్ గా ఉండే. అందుకే 2014లో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. 2018లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారు. అయితే ఆ పార్టీ అధినేత పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు…

TELANGANA

పాఠశాలల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు చిన్నపాటి రిపేర్లను వేసవి సెలవుల లోపు పూర్తి చేసేందుకు ఎమర్జెన్సీ అండ్ మెయింటనెన్స్ ఫండ్ విడుదల చేయనుంది.   ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, స్విచ్చులు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీటన్నింటినీ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనున్నాయి.…

TELANGANA

భూ కబ్జా కేసుపై జోగినపల్లి సంతోష్ కుమార్ వివరణ..

తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు, నమోదైన కేసు విషయంపై స్పందించారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. తాను ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కాగా, నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాకు పాల్పడిన వ్యవహారంలో బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే సంతోష్ కుమార్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.   ‘షేక్‌పేటలోని సర్వే నంబర్ 129/54లో ఉన్న 904 చదరపు…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకమలుపు.. తెరపైకి కొత్తపేరు..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తుంది. తాజాగా మేక శరణ్ పేరు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. అసలు ఎవరి మేక శరణ్ ?కవితకు ఇతనికి సంబంధం ఏమిటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముడుపుల వ్యవహారంలో ఇతను పోషించిన పాత్ర ఏమిటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.   మేక శరణ్ ..కవిత ఆడబిడ్డ…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడి అధికారులు, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో తనిఖీలు చేస్తున్నారు. కవిత బంధువుల ఇళ్ళలో ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది.   ఈ రోజు ఉదయం నుండి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కవిత కాల్ డేటా…

TELANGANA

లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోన్నాయి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లను ఇస్తోన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.   ఇప్పటికే బీఆర్ఎస్ పలు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల…

TELANGANA

బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మితో దీపాదాస్ మున్షీ భేటీ: కేసీఆర్‌కు షాక్ తప్పదా..?

లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ సన్నిహితుడు కే కేశవరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.   శుక్రవారం బీఆర్ఎస్సీనియర్నేత కే కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్మున్షీ భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని…

TELANGANA

ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ అనూహ్య ఎంపిక – మరో ఇద్దరి ప్రకటన..!!

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు ప్రధాన పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశారు.   అభ్యర్థుల ఖరారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లోను పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను రెండు విడతలుగా ఖరారు చేసింది. బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించింది.…

NationalTELANGANA

57 మందితో కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా..

లోక్‌సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కూడిన మూడు జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసీసీ ఎంపిక చేసింది.   అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలోని పలు…