పార్వతీపురం, మన్యం జిల్లా :
కెమిశీల పంచాయతీ నాయుడు వలస గ్రామం నాయుడు వలస గ్రామంలో అంగన్వాడి పోస్ట్ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని. కోరుతూ పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఐటిడిఏ పిఓ విష్ణు చరణ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి పత్రిక విలేకరులతో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి అంగన్వాడి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న హారిక సునీత కలిసి విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కెమిశిల పంచాయతీ నాయుడు వలస గ్రామానికి మినీ అంగన్వాడి పోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని అయితే ఈ గ్రామంలో కోడలుగా ఉంటున్న హారిక సునీత భర్త( మీ నక రవిశంకర్) అనే ఆమె పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అలాగే కొట్టు పంచాయతీ రాయిపురం గ్రామానికి చెందిన పాలక సునీత భర్త పేరు (నిమ్మక శ్రీను) కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అయితే వీరిద్దరు కూడా 11 _1 _2023వ తేదీన పార్వతీపురం ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద ఇద్దరకు మినీ అంగన్వాడి పోస్ట్ కోసం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగిందని అయితే ఈ విషయం ఇలా ఉండగా పాలక సునీత అనే ఆమె నాయుడు వలస గ్రామానికి చెందిన కన్నవారు అని రాయిపురం గ్రామంలో తమ అత్త వారు ఇంటి దగ్గర ఉంటుందని ఇలాంటి సందర్భంలో పాలక సునీతకు నాయుడు వలస గ్రామంలో ఉండే విధంగా రెసిడెన్సి సర్టిఫికెట్ రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగిందని అయితే ఇలాంటి సందర్భంలో రాయపురం గ్రామంలో తమ అత్తవారి ఇంటికాడ ఉంటున్న పాలక సునీతకు నాయుడు వలస గ్రామంలో ఉండేవిధంగా రెసిడెన్సి సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని అలాగే అంగన్వాడి పోస్ట్ విషయంలో స్థానిక గ్రామంలో ఒక ఇంటి కోడలుగా ఉండాలని నిబంధనలు కూడా ఉన్నాయని ఇలాంటి సందర్భంలో నాయుడు వలస గ్రామానికి సంబంధించి కోడలుగా ఉంటున్న హారిక సునీతకు మినీ అంగన్వాడి పోస్ట్ ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని అయితే ఇది కాదని రాయపూర్ గ్రామంలో కోడలుగా ఉంటున్న పాలక సునీతకి అంగన్వాడి పోస్ట్ ను నాయుడు వలస గ్రామంలో ఉండే విధంగా రెసిడెన్సి సర్టిఫికెట్ తో దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగిందని ఇలాంటి సందర్భంలో రాయపురంలో ఉంటున్న పాలకు సునీతకు నాయుడు వలస గ్రామంలో ఉండే విధంగా రెసిడెన్సి సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో తెలియజేయాలని ఏది ఏమైనా వెంటనే నాయుడు వలస మినీ అంగన్వాడికి సంబంధించిన దరఖాస్తు చేసుకున్న వారిపై వెంటనే పూర్తిస్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేపట్టి అర్హులైన వారికి మాత్రమే పోస్ట్ ఇవ్వాలని ఈ విషయం పైన కొద్ది రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కొమరాడ తహసిల్దార్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగిందని ఇంతవరకు ఎటువంటి విషయాలు తెలియకపోవడంతో పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పీవో విష్ణు చరణ్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగిందని వెంటనే పిఓ గారు చర్యలు తీసుకొని గ్రామంలో దర్యాప్తు చేపట్టి అన్ని విధాలుగా అర్హులైన వారికి అంగనవాడి పోస్ట్ ఇస్తామని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యుల హర్షవర్ధన్ రవి పాల్గొన్నారు