AP

చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక

4 H Dనేటి నుంచి చెన్నూరులో ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా ఏటా చెన్నూరు
పట్టణంలోని పెద్ద మసీదు వెనకాల ఉన్న దర్గా వద్ద నిర్వహించే హజ్రత్ సయ్యదా బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యుల నేతృత్వంలో స్థానిక దర్గా ప్రాతంలో ఏర్పాట్లు చేశారు. దర్గాకు రంగులు వేయించి అందంగా ముస్తాబు చేశారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు, పొరుగున ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో ఈసారి కవ్వాలి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల మొదటి రోజును గంధంగా, రెండో రోజు ఉర్సుగా నిర్వహిస్తారు.