గత కొన్నాళ్లుగా సీనియర్ ఎన్టీఆర్ ( Sr NTR) శత జయంతి వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. మహానుభావుడి వందో జయంతి పొలిటికల్ టర్న్ తీసుకోవడమే ఇందుకు కారణం.
ఈనెల 20న హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)కి ఆహ్వానం ఉంటుందా లేదా అన్న చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ తారక్ తో సహా నందమూరి కుటుంబ సభ్యులకు, సీనియర్ ఎన్టీఆర్ వారసులకు ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకలకు ఎవరెవరిని ఆహ్వానించాలో నిర్ణయించడానికి సావనీర్ కమిటీతో నిన్న చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత తారక్, కళ్యాణ్ రామ్( Kalyan Ram), దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యులను నందమూరి రామకృష్ణ,సావనీర్ కమిటీ అధ్యక్షుడు టీజీ జనార్ధన్ ఇద్దరు వెళ్లి ఆహ్వానించారు.
ఇటీవల విజయవాడలో నిర్వహించిన శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగానే తారక్ కి అభిమాన గణం ఎక్కువ. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ని ఆహ్వానించకపోతే అది వచ్చే ఏడాది ఎలక్షన్ల మీద ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతోనే పిలిచినట్లు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా తాత జయంతి వేడుకలకు మనవడికి ఆహ్వానం అందడం పట్ల తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 28న ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్..తారక్ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.