అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్..
రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న కృష్ణంరాజును భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను విచారణ నిమిత్తం మంగళగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ అనుబంధ సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు…

