CINEMA

‘ఏజెంట్’ బర్త్ డే గిఫ్ట్..

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఏజెంట్”.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయకిగా నటిస్తుంది. ఇక యాక్షన్ తో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ఇది వరకే సాలిడ్ పోస్టర్స్ మరియు టీజర్ గ్లింప్స్ లతో చూస్తే అర్ధం అయ్యింది.

ఇక శనివారం అఖిల్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అల్ట్రా స్టైలిష్ పోస్టర్ ద్వారా శుక్రవారం మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్ ఈరోజు మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్స్ చూస్తుంటే యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే ఏజెంట్ సినిమా భారీ యాక్షన్ ని ప్రామిస్ చేస్తుంది అని చెప్పాలి. ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా స్టన్నింగ్ సీక్వెన్స్ లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇక మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 28 న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.