CINEMA

‘సైంధవ్’ కీలక షెడ్యూల్ పూర్తి

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. ఇక ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు.

ఇకపోతే సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ అద్భుతమైన స్పందన తో ఆసక్తిని పెంచాయి. అంతేకాదు బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కాగా సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.