APCINEMA

యాంకర్ ప్రదీప్ కాబోయే భార్య ఫొటో: లీక్

తెలుగు బుల్లితెరపై ఎక్కువగా లేడీ యాంకర్లే హవాను చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ వాళ్లందరి పోటీని తట్టుకుని నిలబడడంతో పాటు టాప్ హోస్టుగా సత్తా చాటుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు.

అదిరిపోయే హోస్టింగ్, ఆకట్టుకునే వాక్చాతుర్యంతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న అతడు.. ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. మరోవైపు అతడి పెళ్లి గురించి తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీరియల్ నటి ప్రదీప్ కాబోయే భార్య ఫొటో లీక్ చేసింది. వివరాల్లోకి వెళ్తే…

 

బుల్లితెరపై స్టార్ యాంకర్: జీ తెలుగు చానెల్ ద్వారా యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రదీప్ మాచిరాజు.. ఆ తర్వాత అందులోనే చాలా షోలు చేశాడు. ఈ క్రమంలోనే బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును కూడా అందుకున్నాడు. అలా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అనంతరం వేరే చానెళ్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు.

 

హీరోగా బిగ్ సక్సెస్ కొట్టేసి: అద్భుతమైన హోస్టింగ్‌తో బుల్లితెరపై టాప్ యాంకర్‌గా హవాను చూపిస్తోన్న ప్రదీప్.. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఆరంభంలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా వచ్చాడు. క్రేజీగా వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్లతో సూపర్ సక్సెస్ అయింది.

 

వరుస షోలు.. అందులోనే: యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు చేతి నిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ఇప్పుడు ఈ టాలెంటెడ్ గాయ్ ‘ఢీ ప్రీమియర్ లీగ్’, ‘డ్రామా జూనియర్స్’, ‘సర్కార్ 3’ సహా ఎన్నో షోలను హోస్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా జీ తెలుగులో ‘సూపర్ క్వీన్ 2’ను కూడా నడుపుతున్నాడు. ఇందులో అమ్మాయిలతో కలిసి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

యాంకర్ ప్రదీప్ పెళ్లి టాక్: ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. సుదీర్ఘ కాలంగా అతడి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి పెళ్లి విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రదీప్ పెళ్లి చేసుకోనని చెప్పినా ఈ ప్రచారాలు మాత్రం ఆగట్లేదు.