CINEMA

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ప్రియమణి.. తలకిందులుగా తపస్సు చేసిన రాని ఛాన్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకండ్ ఇన్నింగ్స్ రిజల్ట్స్ తన కెరీయర్ ని ముందుకు తీసుకెళ్తుంది .

రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో లక్ష్మి అనే పాత్రలో నటించి మెప్పించిన ప్రియమణి .. ఈ సినిమా పుణ్యమా అంటూ బడాబడా ఆఫర్స్ ను తన ఖాతాలో వేసుకుంటుంది.

 

రీసెంట్ గానే హీరోయిన్ ప్రియమణి మరో ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ లో భాగమైంది . మలయాళీ నటుడు సూపర్ స్టార్ మోహన్ లాల్ నీరు సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ప్రియమణి . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని ..ఈ షూటింగ్లో ఆమె కూడా పాల్గొనట్లు చెప్పుకొచ్చింది.

 

ఈ సినిమాకి ప్రముఖ మలయాళీ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా జీసస్ జోసెఫ్ దృశ్యం , దృశ్యం 2 లాంటి సినిమాలను తెరకెక్కించారు . మోహన్ లాల్ జీతూ కాంబినేషన్లో వస్తున్న ఐదవ సినిమా ఇది కావడం గమనార్హం. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ప్రియమణి తన నటనతో అందంతో సెకండ్ ఇన్నింగ్స్ లో బాగానే ఆఫర్లు పట్టేస్తుంది..!!