CINEMA

షాకింగ్ ట్వీట్ చేస్తున్న బండ్ల గణేష్..!

నటుడుగా.. నిర్మాత గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా ఎప్పుడూ ఆయనతోనే ఉండే బండ్ల గణేష్(Bandla Ganesh) ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరొకసారి సంచలనంగా మారాయి. అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టాడో కానీ ప్రస్తుతం అవి మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియాకి చిత్ర పరిశ్రమ కి బాగా సుపరిచితుడైన ఈయన బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన స్టైల్.. అవతలి వ్యక్తి ఎవరనేది ఆయన పట్టించుకోరు.. తాను చెప్పాలనుకున్నది సూటిగా .. సుత్తి లేకుండా.. బోల్డుగా చెప్పేస్తాడు.

అందుకే ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండడమే కాదు అంతకుమించి ఇండస్ట్రీలో వైరల్ అవుతూ ఉంటాడు. తరచూ హాట్ టాపిక్ అవుతూ ఉంటాడు. ఇటీవల నిన్న ఒక సీనియర్ జర్నలిస్టుని బ్లాక్ మెయిలర్ అంటూ ఒక రేంజ్ లో దుమ్మెత్తి పోసిన బండ్ల గణేష్ తాజాగా మరొకసారి చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు.. మరొకవైపు వైసీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంతకు బండ్ల గణేష్ ఏం ట్వీట్ చేశాడు అనే విషయానికి వస్తే..’ ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెబుతున్నా దయచేసి ఎవరిని నమ్మకండి.. ఎవరు మనకు సహాయం చేయరు. ఎవరు మనల్ని ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు . బ్రహ్మాండంగా వాడుకుంటారు . వాడుకున్న తర్వాత మళ్లీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది.. ఇంకో బొమ్మ ..ఆ బొమ్మతో ఆడుకుంటారు ఆడుకునే వాడు ఒక్కడే కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మీ అందరికీ చెబుతున్న మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. ఎవరినైనా నమ్మామా.. మన గొంతు మనం కోసుకున్నట్లే.. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి.. మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి.. మీ శక్తితో మీరు పోరాడండి ఎంత పెద్దవారైనా గౌరవించండి కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి’ అంటూ బండ్ల గణేష్ హిత బోధ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.