CINEMA

అవతార్ 2 కి ఆ నెంబర్‌ అందని ద్రాక్షేనా?

అతి నమ్మకం కొంప ముంచుతుంది అంటారు. హాలీవుడ్ చిత్రం అవతార్ 2 యొక్క పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాగూ అవతార్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని, కనుక పెద్దగా ప్రమోషన్ లేకుండానే మౌత్ టాక్ తోనే భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి తారుమారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితి అయితే లేదు.. కానీ రూ. 10,000 కోట్లు సునాయాసంగా వస్తాయని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆ నెంబర్ కి చేరే పరిస్థితి కనిపించడం లేదు. హాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీలో ఈ చిత్రం 7000 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

సినిమా దాదాపుగా 900 మిలియన్ డాలర్ల ను ఖర్చుచేసి ఇప్పటి వరకు 500 మిలియన్ డాలర్లను కూడా దక్కించుకోలేక పోయిందట. దాంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఖచ్చితంగా భారీగా వసూలు సాధిస్తుందని పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. సినిమాను 7 వేల కోట్ల నుండి పది వేల కోట్లకు లాగేందుకు ఇప్పుడు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. పబ్లిసిటీ కార్యక్రమాలు పెంచే ప్రయత్నం చేసినా కూడా పరిస్థితి కష్టమే అని అవతార్ 2 సినిమాకు పది వేల కోట్ల కలెక్షన్స్ అందరిని ద్రాక్ష అవ్వచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది.