Health

నీటి తాగే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమవుతుంది?

మన శారీరక ఆరోగ్యంలో నీరు ప్రధమ పాత్ర పోషిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటాలి అంటే విటమిన్లు, ప్రోటీన్లు ఏవిధంగా అయితే కావాలో నీరు కూడా అంతే ముఖ్యంగా కావాలి.
అయితే కొంతమంది మన శరీరంలో నీటి శాతం ఎక్కువే కదా నేను లావుగా నీరు పట్టి ఉన్నాను కాదే అనే ఉద్దేశంతో నీటిని తాగాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అలాంటి వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వయసుకు తగ్గట్టు, బరువుకు తగ్గట్లుగా నిపుణులు నిర్ధేశించిన మొత్తంలో నీళ్లు తాగకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు అంటున్నారు. శరీరంలో మోతాదుకు తక్కువ నీళ్లు ఉంటే చిన్న అనారోగ్య సమస్యలు కూడా ప్రాణాపాయ స్థితికి తీసుకు వెళ్తాయట.

మంచి నీళ్లు ఎక్కువ తాగని వారికి తల నొప్పి తో మొదలుకుని గుండె నొప్పి వరకు ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అధికంగా నీళ్లు తాగడం వల్ల లాభాలు ఏంటీ.. తాగకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరీరం డీ హైడ్రేషన్‌ అవుతూ ఉంటుంది.

అది రెగ్యులర్‌ పక్రియ. అయితే కొన్ని సార్లు చాలా ఎక్కువగా డీ హైడ్రేషన్‌ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో తక్కువ నీళ్లు తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ సమస్య తలెత్తి తీవ్రమైన తల నొప్పిగా మారుతుంది. అలా తల నొప్పికి కారణం నీళ్లు తాగకపోవడం అంటూ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

రెగ్యులర్ గా మంచి నీటిని అధిక మొత్తంలో తాగుతూ ఉండడం వల్ల మలబద్దక సమస్య అనేది దరి చేరదు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇక రక్త ప్రసరణ సరిగా సాగాలన్నా కూడా మంచి నీటిని అధికంగా తాగితే అవుతుంది. మంచి నీళ్లు అధికంగా తాగకుంటే రక్త నాళాల ద్వారా స్పీడ్‌ గా రక్తం ప్రసరణ అవ్వదు. తద్వార గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఇక ఎక్కువ శాతం మందికి మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం లేదా మూత్రం పచ్చగా గోధుమ వర్ణం లో ఉండటం వల్ల కూడా మీరు నీళ్లు ఎక్కవగా తాగడం లేదని అర్థం. నీళ్లు ఎక్కువ తాగిన సమయంలో యూరిన్‌ నార్మల్‌ గా రావడంతో పాటు మంట తగ్గుతుంది. ఎంత ఎక్కువగా వాటర్ తాగితే అంత ఎక్కువగా యూరిన్ వస్తుంది. తద్వార అంత ఎక్కువగా కిడ్నీలు శుభ్రం అవుతాయని అంటూ ఉంటారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఎక్కువగా యూరిన్‌ కు వెళ్లడం వల్ల కిడ్నీల్లో ఉన్న రాళ్లు కూడా కరిగి పోవడం లేద పడిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి మంచి నీళ్లు అధికంగా తాగక పోతే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనేది కన్ఫర్మ్‌