APCINEMATELANGANA

పార్టీ లేదా పుష్ప?.. వస్తున్నా బావ.. బన్నీ- తారక్ మధ్య ఫన్నీ చాట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun) కి ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం ట్విట్టర్ వేదికగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.

వీళ్ళిద్దరి మధ్య కాసేపు ఫన్నీ చాట్ నడిచింది. ఒకరినొకరు ‘బావ’ అని పిలుచుకుంటూ సందడి చేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తొలుత ‘పుట్టినరోజు శుభాకాంక్షలు బావ’ అని తారక్ ట్వీట్ చేయగా.. ‘థాంక్యూ బావా.. వార్మ్ హగ్స్’ అని బన్నీ రిప్లై ఇచ్చాడు. దీనికి జూనియర్ స్పందిస్తూ..’ హగ్స్ మాత్రమేనా పార్టీ లేదా పుష్ప ? అనగా.. ‘ వస్తున్నా’ అంటూ బన్నీ ట్వీటాడు.

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ‘పార్టీ లేదా పుష్ప?’ అన్న డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అదే డైలాగ్ ని ఎన్టీఆర్ కూడా వాడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్- కొరటాల( Koratala Siva) కాంబినేషన్లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘వస్తున్నా’ అనే టైటిల్ ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అదే ఆ విషయాన్ని బన్నీ సింబాలిక్ గా చెప్పారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.