తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం ధాటికి పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది.
ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ చ్చింది. రాగల మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు.
దంచి కొడుతున్న వానలు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారుఅటు రాయలసీమ జిల్లాలోను మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
మూడు రోజులు అప్రమత్తం: తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
హైదరాబాద్ కు బిగ్ అలర్ట్: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారిపోయాయి. మరో 24 గంటలు హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు (ఆదివారం), రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.