TELANGANA

బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకెళ్తాం: మల్లన్న..

TG: బీసీ వాదాన్ని గ్రామగ్రామానికి తీసుకువెళ్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీవాదం తెలంగాణలో బలపడ్డ సూచనలు కనిపిస్తున్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ.. అధికార పార్టీ నేతలను వెనక్కి లాగేంత బలమైన శక్తిగా మారారని చెప్పారు. కులగణన లెక్కలు తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.