స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫోకస్..! అభ్యర్థుల ఎంపికపై జగన్ కీలక సూచనలు..
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన రాబోయే ఎన్నికల కార్యాచరణపై విస్తృతంగా చర్చించి నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలైనంత త్వరగా ప్రజాదరణ కలిగిన మంచి అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ…

