బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరు చోట్ల గాయాలు..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడిచేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడిచేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ…