ఏపీ, తెలంగాణల్లో కలకలం
అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి. వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం…