ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు..?
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని సభలో మాత్రం ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ ప్రతిపాదనతో పాటు జమిలి ఎన్నికల బిల్లును కూడా ఒకేసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 20 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి.…