రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం..
రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, నిబంధనలు పాటిస్తూ చేసే చట్టబద్ధమైన బియ్యం ఎగుమతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో…