ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన…