National

National

ఆత్మనిర్భర్ భారత్‌లో మరో ముందడుగు.. డీఆర్‌డీవో హెచ్ఏపీఎస్ ప్రయోగం సక్సెస్..

డీఆర్‌డీఓ తన ప్రస్థానంలో మరో కీలక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ (హెచ్ఏపీఎస్) ప్రయోగాత్మక పరీక్షను మంగళవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా ఎయిర్ షిప్ ఏకంగా 21 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని, భారత నిఘా, వైమానిక సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రయోగాత్మక ఎయిర్ షిప్ సముద్ర మట్టానికి…

National

లైంగిక నేరాలకు చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడే వికృత మనస్తత్వమున్న వ్యక్తులకు చట్టం, పోలీసులంటే చావు భయం పుట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం వంటి తప్పులు చేస్తే చచ్చిపోతామన్న భయం నేరస్థుల్లో కలిగినప్పుడే మహిళలపై జరిగే దారుణాలను అరికట్టగలమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో దేశ రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం సహా వరుస దారుణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

National

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!

 ఫ్లై దుబాయ్‌ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ పై దాడి చేసిన కో-పైలట్‌ హమామ్‌ అల్‌హమామీ, విమానాలు నడపకుండా ఒమన్‌ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించినట్లు తేలింది. తీవ్రవాద భావజాలం కలిగి ఉన్నాడన్న కారణంగా అతడిపై ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక అల్‌హమామీ.. ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లో కూల్చివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు కూడా రిపోర్ట్ వచ్చింది. ఒమన్‌కు చెందిన హమామ్‌ అల్‌హమామీ.. 2024లో ఒమన్‌…

National

ఢిల్లీ దద్దరిల్లింది.. ముంబై హోరెత్తింది.. సర్‌ వివాదంలో జెన్ జీ 2.O సమరం..!

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.మరోవైపు స ర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఆందోళనలను ఉధృతం చేసింది.మరో వైపు జెన్‌ జీ 2.O అంటూ CJP కూడా మళ్లీ నిరసనల సైరన్‌ మోగించింది. మరోవైపు అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ ను ప్రకటించింది ఈసీ. జాతిపిత మహాత్మాగాంధీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది.అ దే టైమ్‌లో సర్‌…

National

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు కాంగ్రెస్ భారీ నిరసనలు..! కారణం అదేనా..?

కేంద్ర ఎన్నికల సంఘం వివాదంపై దేశవ్యాప్తంగా చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కీలక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 5న ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జ్‌లు, అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు పాల్గొననున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ మిగిలిన ఇద్దరు కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్షంగా…

National

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్..! వాణిజ్యం, రక్షణ, ఇంధనంపై కీలక చర్చలు..

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన అంశాలపై చర్చించారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతల రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని సమీక్షించినట్లు మోదీ తెలిపారు. ట్రంప్‌తో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని మోదీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. భారత్-అమెరికా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా కొనసాగాలని ఇరు దేశాల నేతలు అంగీకరించినట్లు తెలిపారు.ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇద్దరూ…

National

ఎన్నికల ప్రక్రియలో భారీగా అక్రమాలు..! మోదీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్..

ఎన్నికల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు కీలక తీర్మానాన్ని ఆమోదించారు.దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను…

National

యూపీఐ ఛార్జీలపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ.. అక్టోబర్ 15 నుంచి అమలు..

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిపే నిర్దిష్ఠ‌ లావాదేవీలపై 0.4% ఛార్జీలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాటిని నిలిపివేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టింది. ఈ నిర్ణయంతో షెడ్యూల్ ప్రకారమే కొత్త ఛార్జీల అమలుకు మార్గం సుగమమైంది.ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఛార్జీల విధింపుపై…

National

సింధు జలాలపై వాస్తవాలు ఇవే..! పాకిస్థాన్ డ్రామా బట్టబయలు..

పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్రమైన నీటి, ఆహార భద్రత సంక్షోభానికి భారతే కారణమంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆరోపణలు చేస్తున్నారు. సింధు జలాల ఒప్పందం పవిత్రతను ప్రస్తావిస్తూ, దీనివల్ల తమ దేశంలోని 25 కోట్ల ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని అంతర్జాతీయ వేదికలపై వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా తమ దేశీయ అసమర్థ పాలన, వైఫల్యాల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని ఓ కీలక నివేదిక స్పష్టం చేసింది. భారత సింధు జలాల మాజీ కమిషనర్…

National

యూపీఐ లావాదేవీలపై చార్జీలు.. వినియోగదారులకు భారం లేదన్న నిర్మలా సీతారామన్..

యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలు విధించనున్నారనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ఈ అంశంతో సాధారణ ఖాతాదారులు లేదా వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి జేబుపై ఎలాంటి అదనపు భారం పడదని తెలిపారు. రూ.2,000కు మించిన కొన్ని నిర్దిష్ట డిజిటల్ లావాదేవీలకు ఎండీఆర్ వర్తించినా, అది వినియోగదారులకు కాదని, వ్యాపారులకే పరిమితమని మంత్రి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు…