National

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ….

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో సహకరించడానికి ఆపిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది.

 

సెట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి డివైజ్ యజమాని మాత్రమే డేటాను యాక్సెస్ చేయగలరని ఆపిల్ తేల్చిచెప్పినట్లు సమాచారం.

 

నివేదికల ప్రకారం, కేజ్రీవాల్ ఫోన్‌ను తెరవడానికి ఈడీ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇక తప్పేది లేక ఆపిల్ కంపెనీ సహకారం కోరింది.

 

వ్రాతపూర్వక కమ్యూనికేషన్ లేనప్పటికీ, “కేజ్రీవాల్ ఫోన్‌ను తెరవడంలో సహాయం చేయమని ఆపిల్‌ను కోరింది. కానీ ఆపిల్ దాన్ని తిరస్కరించిది” అని నివేదికలు పేర్కొన్నాయి.

 

ఇలాంటి అభ్యర్థనను ఆపిల్ తిరస్కరించడం ఇదే మొదటిసారి కాదని కూడా నివేదికలు పేర్కొన్నాయి.

 

గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత ఈడీ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తరుణంలో ఢిల్లీ సీఎం ఉద్దేశ్యపూర్వకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, పాస్‌వర్డ్ చెప్పటానికి నిరాకరించారని ఈడీ స్పష్టం చేసింది. ఈడీ తన ఫోన్‌ను యాక్సెస్ చేస్తే ఆప్ గోప్యతకు భంగం కలుగుతోందని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు.

 

మరోవైపు, ఢిల్లీ సీఎం తమ ప్రశ్నలకు దాటవేసే సమాధానాలు ఇస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది.

 

పౌర హక్కుల రక్షణలో ఆపిల్

2016లో, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, శాన్ బెర్నార్డినో అటాకర్ సయ్యద్ ఫరూక్ ఉపయోగించిన ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాలన్న US ప్రభుత్వ అభ్యర్థనను ప్రతిఘటించే కంపెనీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు, దీనిని పౌర హక్కుల రక్షణకు విఘాతం కలగజేయడేమనని ఆపిల్ స్పష్టం చేసింది.

 

కుక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆపిల్ దృఢమైన వైఖరిని నొక్కిచెప్పారు.

 

నాలుగు సంవత్సరాల తర్వాత, ఆపిల్ మాజీ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ ప్రైవసీ, జేన్ హోర్వత్, అవసరమైన సేవలను రక్షించడంలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు.

 

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మార్చి 21న అరెస్టు అయ్యారు. తదనంతరం ఢిల్లీ కోర్టు ద్వారా ED కస్టడీకి అనుమతించారు. నిర్దిష్ట వ్యక్తులకు అనుకూలంగా ఎక్సైజ్ పాలసీని రూపొందించడానికి సంబంధించిన కుట్రలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

 

ఏప్రిల్ 1న ఢిల్లీ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.