TELANGANA

TELANGANA

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు..!

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయింది. దానం నాగేందర్ అనర్హతపై అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్రంలో 60వ అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్ ఉంది. దీంతో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేకు అనర్హుడిగా అసెంబ్లీ ప్రకటించింది. హైకోర్టు తీర్పును అనుసరించి అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి ప్రకటనను విడుదల చేసారు. అయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా…

TELANGANA

హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్చల్ ..!

హైదరాబాద్ నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. మణికొండలోని ఒక అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన ఈ ముఠా సభ్యులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వివరాల్లోకి వెళితే, నిన్న తెల్లవారుజామున మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ప్రవేశించారు. నివాసంలోకి చొరబడి దొంగతనానికి పాల్పడుతుండగా, ఒక మహిళ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఆమెపై దాడి చేసి అక్కడి…

TELANGANA

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా..! కవిత సంచలన వాఖ్యలు..!

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున పోటీలో దిగుతున్నామని పార్టీ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని కవిత విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇన్నాళ్లవుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని, చేతల్లో శూన్యం అని…

TELANGANA

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు.. ప్రభుత్వం కీలక ప్రకటన..

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను అక్టోబర్ 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి…

TELANGANA

చలానాల రాబడిపై సర్కార్ కొత్త ప్లాన్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే, కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (టీజీ –ఎంఏఆర్ ఎస్ )ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

TELANGANA

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు..

సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ దర్యాప్తులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రూ.2.1 కోట్ల నగదు లావాదేవీలపై వివరణ తీసుకునేందుకు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. సాహితీ ఇన్‌ఫ్రా ఖాతాల నుంచి గాంధీకి సుమారు రూ.2.1 కోట్ల మేర బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.తెలంగాణ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థపై ప్రీ-లాంచ్…

TELANGANA

స్పీకర్ చాటున దాక్కోవచ్చని భావించిన రాహుల్, రేవంత్‌లకు ఇది “సుప్రీం చెంపపెట్టు”: కేటీఆర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి,…

TELANGANA

22ఏ భూములపై కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఆస్తి యజమానులకు భారీ ఊరట కల్పించింది. 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ… జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లు, భవనాలకు రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయగా, అవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.సాంకేతిక కారణాలు లేదా రెవెన్యూ…

TELANGANA

వరంగల్ విమానాశ్రయానికి ‘రాణి రుద్రమ’.. ఆదిలాబాద్‌కు ‘కొమరం భీం’ పేర్లు..!

వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు ఖరారు చేసింది. మామునూరు ఎయిర్‌పోర్టుకు కాకతీయ రాణి రుద్రమదేవి పేరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఫైలును కేబినెట్ సమావేశం ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ పేర్లపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టిన తరహాలోనే, తెలంగాణ చారిత్రక వైభవాన్ని, వీరుల…

TELANGANA

కృష్ణా నీటి వాటాపై సంచలన నిజాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్..!

కృష్ణా జలాల్లో తీవ్ర నష్టం చేసింది BRS. BRS కు మాటలు ఎక్కువ పని తక్కువ అని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. జూరాల రెండు పక్కల తెలంగాణ ఉంది. జూరాలలో 70 TMC లతో ప్రాజెక్ట్ డిజైన్ చేశారని, ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవో ప్రకారం మనకు నీటివాటా హక్కు ఎక్కవ ఉందని అన్నారు. కానీ వాటర్ సోర్స్ మార్చారు. డిజైన్ మార్చారు. భూ సేకరణ లేకుండానే 55వేల కోట్లతో DPR సమర్పించారని అన్నారు. కానీ…