TELANGANA

TELANGANA

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్..

కెసిఆర్ రెండుచోట్ల గెలుస్తారా? లేకుంటే ఓడిపోతారా? ఆయనకు లభించే మెజారిటీ ఎంత? అన్నదానిపై ఎక్కువగా బ్యాటింగ్ జరుగుతోంది. అటు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజారిటీ పై సైతం పెద్ద ఎత్తున నగదు జమ చేసి మరి బెట్టింగ్ కొడుతున్నారు. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపు పొందుతుంది? అన్న అంశాలపై సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ బెట్టింగ్ పర్వం బలంగా…

TELANGANA

అట్లుంటది బీజీపీతో.. సోషల్‌ ఇంజినీరింగ్‌తో త్రిముఖ పోరు!..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, లిక్కర్‌ కేసులు సీఎం కూతురు కవితకు మినహాయింపు ఇవ్వడం, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న కిషన్‌రెడ్డిని నియమించారన్న ప్రచారం జరగడం, సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన పెద్దనేతలు పార్టీని వీడడం తదితర పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ఎన్నికల రేసు నుంచి బీజేపీ దాదాపు తప్పుకుందని అంతా భావించారు.…

TELANGANA

తెలంగాణలో ముగిసిన ప్రచారం..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిన వీధులు నిశబ్దంగా మారిపోయాయి. తెలంగాణ ఓటర్లు గురువారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.   రాష్ట్ర ఎన్నికల సంఘం…

TELANGANA

మల్కాజ్‌గిరిలో రాహుల్‌, ప్రియాంక గాంధీ రోడ్‌షో..

తెలంగాణ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరడంతో ఇవాళ సాయంత్రం వరకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. శాసనసభ ఎన్నికల ప్రచారపర్వంలో ఆఖరి రోజైన మంగళవారం.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రజల్లోకి వెళ్లారు.   మంగళవారం మల్కాజిగిరిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ రోడ్డు షోలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున…

TELANGANA

హరీష్ రావు నోటి దూలతోనే రైతుబంధు ఆగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు జోరుగా తలపడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయటంతో ఇదంతా కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది.   ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్…

TELANGANA

ఏడవాలంటే కాంగ్రెస్ కు.. నవ్వాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యమన్న కేటీఆర్..

మీరు ఏడవాలి అంటే కాంగ్రెస్ కు, నవ్వాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ధర్మపురి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రైతు బంధు బంద్ కావటానికి కారణం కాంగ్రెస్ అన్నారు.   పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?…

TELANGANA

గేర్‌ మార్చిన కేసీఆర్‌.. చివరి నిమిషంలో కొత్త అస్త్రాలు వెలికితీత.. గెలుపుతీరం చేర్చేనా?

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. తెలంగాణ ఎన్నికల సంగ్రామం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అయితే 80కి ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్‌ చేశారు. మరోవైపు విజయం తమదేనని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకత్వం చెబుతోంది. కానీ, లోలోపల భయం మొదలైంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ…

TELANGANA

80 సీట్లలో కాంగ్రెస్ గెలవగలదా? రేవంత్ ధైర్యమేంటి..?

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. 80 స్థానాల్లో విజయం ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అలా రాకుంటే కెసిఆర్ వేసే శిక్షకు మేము బాధ్యులమవుతామని చెబుతున్నారు. అయితే ఆయన ప్రమాదకర సవాల్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడు…

TELANGANA

కొలువులు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి: ప్రియాంకా గాంధీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కోసం ప్రచారం సాగించిన ప్రియాంకా గాంధీ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను టార్గెట్ చేశారు.   నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో…

NationalTELANGANA

తెలంగాణ మార్పు కోరుకుంటోంది-జనం విసిగిపోయారన్న ప్రధాని మోడీ..

మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.   కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్,…