TELANGANA

TELANGANA

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్‌ అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు…

TELANGANA

ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు.. కాంగ్రెస్‌ ఓటమి ఖాయం: కవిత..

ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వారిని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర అభివృద్ధిలో కీలక…

TELANGANA

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా..? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు..

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారన్నారు. ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు గొప్పులు చెప్పుకుంటూ సభను తన అడ్వర్ టైజ్ మెంట్ కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.…

TELANGANA

22ఏ అనేది పొరపాటు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గం: హరీశ్ రావు

తెలంగాణలో నిషేధిత భూముల జాబితా 22ఏ వివాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాలో భూములను చేర్చడం కేవలం సాంకేతిక పొరపాటు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో చేసిన పెద్ద దుర్మార్గమని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ బాధితులతో బీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ పేరుతో ప్రజల భూములకు ‘భూ హారతి’…

TELANGANA

బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..

ప్రతిపక్ష బీఆర్ఎస్ కుట్రలను దీటుగా తిప్పికొట్టాలని, అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఈ మేరకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్…

TELANGANA

సాక్షాత్తు సీఎం సొంత ఊరిలోనే ఈ దుస్థితా..?: కేటీఆర్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసిందని… కేసీఆర్ హయాంలో లభించిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ స్థానంలో మళ్లీ పాతకాలపు కరెంటు కోతలు పునరావృతమవుతున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామైన నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన రైతులు తమ కష్టాలను వెళ్లబోసుకుంటున్న వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకుంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కాంగ్రెస్…

TELANGANA

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్ర..? కేసీఆర్‌పై అసెంబ్లీలో రేవంత్‌ ఆరోపణలు..!

అసెంబ్లీ స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై మాటల దాడికి పాల్పడటం పార్లమెంట్‌, ముంబయి, పుల్వామా దాడులతో సమానమని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై చర్చ జరగకుండా అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కుట్రకు తెరతీశారని ఆరోపించారు.శాసనసభలో బుధవారం మాట్లాడిన సీఎం.. స్పీకర్‌ స్థానాన్ని, ఆయన తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్పీకర్‌ను దూషించిన ఘటనను సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారని తెలిపారు. ఇలాంటి ఘటన తర్వాత కేసీఆర్‌ స్వయంగా స్పీకర్‌తో మాట్లాడి…

TELANGANA

ఆ బూతులు భరించలేకనే కడుపు మండి మాట్లాడా!: కేసీఆర్ పై వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే శంకర్ వివరణ..

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన రాజకీయ దుమారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును కోరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని ఆయన అంగీకరించారు. అయితే, సభలోనూ బయటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దళిత వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను, మహిళా మంత్రులను బీఆర్‌ఎస్ నేతలు అత్యంత అసభ్యకరంగా, కులాల పేరుతో దూషిస్తూ లక్ష్మణరేఖ…

TELANGANA

ఎర్రవల్లికి బయల్దేరిన కేటీఆర్, హరీశ్‌రావు.. మధ్యలోనే అరెస్ట్..

తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై తాతా మధు చేసిన కామెంట్స్ ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేస్తున్నారన్న సమాచారంతో బీఆర్‌ఎస్‌ నేతలు అలెర్ట్ అయ్యారు.ఈ క్రమంలోనే కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే ఎర్రవల్లి వద్ద ఘర్షణ వాతావరణం ఉండటంతో శాంతి భద్రతల కారణంగా కేటీఆర్‌, హరీశ్‌రావులను మాత్రం హకీంపేట ప్రాంతంలో…

TELANGANA

తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు .!

తెలంగాణ శాసన సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ పై తెలంగాణ అసెంబ్లీ ముందు దరుసుగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలైన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శాసన మండలి షెసన్స్‌ మొత్తానికి హజరుకాకుండా వీరిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సంఘటన రాజకీయంగా…