AP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారని అభియోగాలు కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి పదివేల అక్రమాలు బయటపడతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, ఢిల్లీలో చక్రం తిప్పి చంద్రబాబు గారు చేసిన పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదంటూ ఆయన మండిపడ్డారు. తన సంపద పెంచుకోవడం కోసమే అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా తన సంపద పెంచుకోవటం కోసమే శ్రమ పడ్డారని విజయ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమీషన్ గా కోట్ల రూపాయల తీసుకున్నారని ఆరోపించారు.

తీసుకున్న 118 కోట్ల లెక్క చూపని ధనం గురించి ఏం సమాధానం చెబుతారు చంద్రబాబు గారూ అంటూ సూటి ప్రశ్న వేశారు. మీరు కటిక పేదవారు కనుకే కుప్పంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. ‘విజనరీ’ అంటే దోచుకోవడంలో ఆరితేరడమా? అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

అంతేకాదు 2020- 2021 కు సంబంధించి 118 కోట్ల మొత్తాన్ని మీరు వెల్లడించని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో దయచేసి తెలియజేయండి అంటూ చంద్రబాబును వైసీపీ ఎంపీ సాయి రెడ్డి టార్గెట్ చేశారు. ఇక తాజా పరిణామాలతో చంద్రబాబును వైసీపీ నేతలు వరుసగా టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి బట్టబయలు అవుతుందని అంటున్నారు.