National

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు

బెంగళూరు: ఎంపీ పదవికి అనర్హత వేటు వేయకుండా చూడాలని దాఖలైన దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిరాశ ఎదురైంది.

హాసన్ ఎంపీ పదవికి తనపై అనర్హత వేటు వేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జేడీఎస్ యువనేత. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

ప్రజ్వల్ రేవణ్ణ పిటిషన్‌ను విచారించి కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును ప్రకటించారు. తాను ఎంపీ పదవికి అనర్హులుగా ప్రకటిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఎంపీ పదవికి అనర్హత వేటుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే వరకు అనర్హత వేటుపై స్టే విధించాలని కోరుతూ ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ మనువడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో సెప్టెంబర్ 1న హైకోర్టు తీర్పునిచ్చింది.

జైల్లో చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ దే బాధ్యత, అధికారంలో ఉన్నామనే?

హాసన్ లోక్ సభ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనువడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పారదర్శకంగా నామినేషన్ పత్రాలు సమర్పించలేదని బీజేపీకి చెందిన నాయకులు, ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.

ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల సమయంలో నియమాలు ఉల్లంఘించారని ఆయన ఎన్నిక రద్దయింది. ప్రజ్వల్‌ను ఎంపీగా విజయం సాధించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ టిక్కెట్ మీద లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఎ మంజు, నియోజకవర్గ ఓటరు జీ. దేవరాజ్‌గౌడ్‌లు దాఖలు చేసిన వరుస పిటిషన్లను విచారించిన అనంతరం జస్టిస్ కె నటరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

బెంగళూరు బంద్ తుస్, ఓరి పిచ్చోడా, ఎవరైనా ఫ్రీ అంటే వద్దంటాడా ?, లాజిక్!

నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో భారత ఎన్నికల సంఘం సూచించిన ఫార్మాట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించకపోవడాన్ని బట్టి ప్రజ్వల్‌ రేవణ్ణ ఎంపికను పిటిషనర్ లు సవాలు చేశారు. ఇది అవినీతికి పాల్పడటమేనని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రమీలా నేసర్గి వాదిస్తూ ప్రజ్వల్ రేవణ్ణ తనకు సంబంధించిన భూమి, బ్యాంకు ఖాతాలు, భాగస్వామ్య సంస్థ డైరెక్టర్ పదవి లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్, అదనపు ఖర్చులు సహా పలు వివరాలను నిజమైన వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టారని వాదించారు.