CINEMA

త్రిషతో వివాదం.. మన్సూర్ అలీ ఇక నటించడం కష్టమే..

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ముందు వరుసలో ఉండేది. కానీ సడన్ గా సినిమాల్లో కనిపించడం మానేసింది. మళ్ళీ తిరిగి సినిమాల్లో మెరుస్తున్న త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల ఆయన కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడేలా ఉందనే చెప్పాలి. వీరిద్దరి వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రోజు రోజుకు ముదురుతూనే ఉంది వీరి మధ్య వార్.

 

More

From Tollywood

ఒక భేటీలో మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఇక మన్సూర్ అలీ ఖాన్ పై టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ సెలబ్రెటీలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కుష్బూ, మాళవిక నాయర్, లియో సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నటి రోజా వంటి నటీనటుల మద్దుతు తెలిపారు. మన్సూర్ అలీ త్రిషకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన మన్సూర్ సరదాగా అన్నానని.. దానిని వివాదం చేయవద్దని కోరారు. తనపై రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

 

అందరూ కోరినట్టుగా త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని.. సౌత్ ఇండస్ట్రీ వివరణ కోరితే ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానంటూ తెలిపారు. దీంతో ఆయనపై మూకుమ్మడి ఒత్తిడి వస్తోంది. అంతే కాదు సౌత్ ఇండస్ట్రీ సినీ నటుల సంఘం ఆయనపై రెడ్ కార్డ్ వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఏకంగా జాతీయ మహిళా కమిషనర్ వరకు వెళ్లింది. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై 509 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ కి కమిషన్ ఫిర్యాదు చేసింది. చూస్తుంటే ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో కూడా అర్థం కావడం లేదు.

 

త్రిషకు మాత్రం మూడు ఇండస్ట్రీల నుంచి మద్దతు లభిస్తుంది. అభిమానులు కూడా అతన్ని దారుణంగా శిక్షించాలని, ఇంకోసారి ఇలా మాట్లాడకుండా శిక్ష వేయాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.