ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు జగన్, సిబిఐ కు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి జగన్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంను ఆశ్రయించారు. దీని పైన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
గతంలో తెలంగాణ హైకోర్టులోనూ రఘురామ పిటీషన్ దాఖలు చేసారు. సీబీఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌ను 2022 అక్టోబరు 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామ కోరారు. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని పిటీషన్ వేసారు. దీనిని తాజా కేసుకు జత చేయాలని సూచించారు.