తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయమైంది. 64 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. ఒకవైపు ముగ్గురు నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు అందరినీ కలుపుకుపోయే, పొరుగు రాష్ట్రా్టలతో సన్నిహితంగా ఉండే, కేంద్రంతో మాట్లాడి నిధులు మంజూరు చేయించుకునే వ్యక్తి సీఎం అయితేనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుంది. ఇన్ని సవాళ్ల మధ్య సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ రెండు రోజులుగా కుస్తీ పడుతోంది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో ఇప్పుడు సీఎం ఎంపిక బాధ్యత ఇప్పుడు ఢిల్లీకి చేరింది.
More
From Telangana politics
రంగంలోకి రాహుల్..
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రంగంలోకి దిగారు. ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం తెలంగాణ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, డీకే శివకుమార్, కేసీ.వేణుగోపాల్ సమక్షంలో సమావేశం జరగుతుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. అంతకుముందు కేసీ వేణుగోపాల్, డీకే.శివకుమార్ సీఎం రేసులో ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. వేర్వేరుగా వారితో సంప్రదింపులు జరిపారు. ఈ వివరాలతో ఖర్గేతో సమావేశానికి వెళ్లారు.
ఈ సమావేశంలో కొలిక్కి..
తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో నిర్వహిస్తున్న సమావేశంలో సీఎం ఎవరనే అంశం కొలిక్కి వస్తుందని పలువురు భావిస్తున్నారు. రేసులో ఎన్న ముగ్గురు నేతల్లో ఎవరైతే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుంది. పొరుగు రాష్ట్రంలో సఖ్యతను కొనసాగించగలరు, కేంద్రంతో సాన్నిహిత్యం ఉంటూ వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న అంశాలనూ ఇందులో పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేసులో ఉన్న అభ్యర్థులు పెట్టే కండీషన్లపైనా చర్చించే అవకాశం ఉంది.
3 గంటలకు హైదరాబాద్‌కే డీకే శివకుమార్
సమావేశం అనంతరం కర్ణాటక ముప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఢిల్లీ నుంచి
హైదరాబాద్‌కు వస్తారని తెలుస్తోంది. ఢిల్లీలోనే సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా, హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశమై వారిద్వారానే ఢిల్లీలో నిర్ణయమైన అభ్యర్థి పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం ఎంపిక సందర్భంగానూ ఇదే సంప్రదాయం పాటించారు. దీంతో తాజగా సీఎం అభ్యర్థిని స్థానికంగానే ప్రకటించే అవకాశం ఉంది.