న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని ఆయన వెల్లడించారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని ఆయన వెల్లడించారు.
మెట్రో రైలు,స్టేషన్లలో సిబ్బంది,పోలీసుల నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి రావద్దన్నారు. మెట్రో స్టేషన్ పరిధిలో ఎవ్వరితో అయినా దుర్భాషలాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. కావున డిసెంబర్ 31న బాధ్యతతో వ్యవహరించాలని ఆయన ప్రయాణికులను కోరారు.
కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ఆదివారం రాత్రి పైవంతెన, ఓఆర్ఆర్ పై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు అనుమతి నివాకరిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే యాజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అవినాశ్ మహంతి హెచ్చరించారు.