National

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ను అప్పగించండి.. పాక్‌ ను కోరిన భారత్..

ముంబైలో మారణహోమం సృష్టించిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు..ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని భారత్‌ ప్రభుత్వం..పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సయీద్ ను అప్పగించాలని పాకిస్తాన్‌ ను భారత్‌ అడిగినట్లు భారత విదేశాంగ మంత్రిశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌న్ బాగ్చి తెలిపారు.

 

దేశంలో మారణహోమం సృష్టించిన అనేక కేసుల్లో.. హఫీజ్‌ సయీద్‌ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని భారత్ వెల్లడించింది. దీనిపై హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ..భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు బాగ్చి తెలిపారు.

 

ఒక నిర్దిష్ట కేసులో విచారణను ఎదుర్కొనేందుకు అతనిని భారత్‌కు అప్పగించాలని తాము పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధిత సహాయక పత్రాలతోపాటు.. అభ్యర్థనను అందించామని బాగ్చీ చెప్పారు. దేశంలో అనేక మంది భారతీయుల చావుకు కారణమైన హఫీజ్‌ సయీద్‌.. అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా ఉన్నాడని..ఆ కారణంతోనే అతన్ని విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని పాక్ ప్రభుత్వాని కోరామన్నారు.