తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి తెలిపారు. తదుపరి సంప్రదింపుల కోసం 70 సంస్థల ప్రతినిధులు తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది.
దుబాయ్‌లో జరిగే సమావేశాలు 70కి పైగా విభిన్న ప్రధాన గ్లోబల్ డిజైన్, ప్లానింగ్ మరియు ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో రేవంత్ వివిధ సమావేశాలు నిర్వహించారు. చర్చల్లో గ్లోబల్ సంస్థలు యూరప్, మధ్యప్రాచ్యం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో గతంలో, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. దాదాపు అన్ని సంస్థలు హైదరాబాద్, తెలంగాణతో భాగస్వామ్యం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదుపరి సంప్రదింపుల కోసం వారు రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ కు వచ్చిన బెస్ట్ ఇన్ క్లాస్ సంస్థలను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. నీటిసమీపంలోని నగరాలు అభివృద్ధి చెందాయన్నాయని చెప్పారు. మూసీని పునరుద్ధరిస్తే.. హైదరాబాద్ అరుదైన నగరంగా ఆవిష్కృతం అవుతుందన్నారు. మూసీని పునరుద్ధరించిన తర్వాత హైదరాబాద్ ప్రపంచంలోనే అవుతుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని ఈ సంస్థలను రేవంత్ రెడ్డి కోరారు.
తాము ఇతర భారతీయ నగరాలు, రాష్ట్రాలతో పోటీ పడడం లేదని.. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన వాటికి వ్యతిరేకంగా బెంచ్‌మార్క్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు అధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి, దానకిషోర్, ఆమ్రపాలి కట్టా ఉన్నారు.