TELANGANA

బస్తీ మే సవాల్.. మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్.!

‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా. ఢిల్లీకి బ్యాగులు మోసేందుకే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. జీవో 111 రద్దుకు అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే మేం ఎత్తివేశాం. ప్రస్తుతం మా దృష్టి పూరి‍్తగా తెలంగాణపైనే. కాంగ్రెస్‌ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా? ఓడితే కాదా? రేవంత్‌ను ఏదో భయం వెంటాడుతోంది. మగాడివైతే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. మహిళలకు పెన్షన్‌ ఇవ్వాలి అని మేము అడగలేమా?’ అని ప్రశ్నించారు.

 

కేంద్ర దర్యాప్తు సంస్థలపై అంత నమ్మకమా..

‘రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జాతీయ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీల విషయంలో బాగా నమ్మకం ఉందా.. ముందు రిజర్వాయర్‌కు, బ్యారేజీకి తేడా తెలుసుకోవాలి. ఇరిగేషన్‌ మంత్రిగా కొత్తగా బాధ్యలు చేపట్టారు. అన్నీ తెలుసుకుంటే మంచిది. కేసీఆర్‌ను బద్నాం చేయాలనుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ మెడిగడ్డకు వెంటనే మరమ్మతు చేయండి. రాజకీయ వేధింపులకు భయపడం. మాకు న్యాయవ‍్యవస్థపై నమ్మకం ఉంది. ఎన్‌డీఎస్‌ఏ దేశంలో ఎక్కడైనా రెండు రోజుల్లో నివేదికను ఇచ్చిందా? రేవంత్ అసెంబ్లీలో చెప్పినట్లు మీకు చేతగాకపోతే మాకు అప్పగించండి. ఇరిగేషన్ శాఖ ఇస్తారా? ప్రభుత్వం నుంచి తప్పుకుంటారా?’ అని నిలదీశారు.

 

కాళేశ్వరంకు 400 అనుమతులు..

ఇక ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెకు‍్టకు 400 అనుమతులు వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. మరమ్మతు చేతకాకపోతే తప్పకోవాలని రేవంత్‌కు సూచించారు. హరీశ్ చెప్పినట్లు తాము నీటిని లిఫ్ట్‌ చేస్తామని పేర్కొన్నారు. ఎన్‌డీఎస్‌ఏ రాజకీయ ప్రేరేపిత నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ఈ నివేదిక మీడియాకు ఎలా అందిందని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ వేసి వర్షాకాలం ప్రారంభంలోగా మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు.

 

వాళ్లకు సెన్స్‌ లేదు.. కామన్‌ సెన్స్‌ లేదు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం 80 రోజుల పాలనలో ఆరోపణలు, శ్వేతపత్రాలు అంటూ కాలక్షేపం చేసిందని విమర్శంచారు. కాంగ్రెస్‌ మంత్రులకు సెన్సు, కామన్‌సెన్సు లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని తెలిపారు. నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.