TELANGANA

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు….

తెలంగాణ రాష్ట్ర సమితి.. ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ పౌరుడికి సుపరిచితమైన పేరు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే టీఆర్ఎస్ గా ఉండే. అందుకే 2014లో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. 2018లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారు. అయితే ఆ పార్టీ అధినేత పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు.

 

అయితే చాలా మందికి పార్టీ పేరును మార్చడం ఇష్టలేదు. కానీ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తి ఎవరికి లేకపోవడంతో పార్టీ పేరు మారిపోయింది.కానీ.. పేరు మార్పు బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టమే జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయింది. కేసీఆర్ కూతురు జైలు పాలయింది. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నేతలు తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి వినోద్ కుమార్ పార్టీ పేరు మార్పుపై స్పందించారు.

 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం తమ పార్టీలో 80 శాతం మందికి ఇష్టం లేదన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కార్యకర్తలు ముక్తకంఠంతో ఇదే మాట చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశంపై న్యాయ సలహాలు తీసుకోవాల్సి అవసరం ఉందన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.

 

వినోద్ కుమార్ వ్యాఖ్యలను బట్టి త్వరలో బీఆర్ఎస్ పేరు మార్చే అవకాశం ఉంది. లోక్ ఎన్నికల తర్వాత పార్టీ పేరు మార్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి పోరాటం చేయగా.. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 2022 అక్టోబర్ 5 టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. అంతే కాదు మహారాష్ట్రలో పలు పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి స్వయంగా కేసీఆర్ వెళ్లి పాల్గొన్నారు.