రెండు లక్షలు రుణం తీసుకుని మాఫీ కాని రైతులకు మహబూబ్ నగర్ రైతు పండుగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధులను విడుదల చేశారు. రుణమాఫీలో నెలకొన్న టెక్నికల్ సమస్యను పరిష్కరించి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రుణమాఫీ జరగని 3.14 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రభుత్వం రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేసింది. కొంతమందికి ఆధార్ లో సమస్యలు, టెక్నికల్ కారణాలు, రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉండటం వల్ల మాఫీ అవ్వలేదు. ఆ రైతులకు కూడా న్యాయం జరిగేలా నేడు రైతుపండుగ సభలోనే నిధులను విడుదల చేశారు.