TELANGANA

కవితకు కేసీఆర్ సంకేతాలు..? రంగంలోకి కవిత..?

బీఆర్ఎస్‌లో కలహాలు తారాస్థాయికి చేరాయా? హరీష్‌రావుపై కేసు నమోదు కావడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కవితకు రూట్ క్లియర్ అయ్యిందా? లీడర్ షిప్ కోసం ఫ్యామిలీలో జరిగిన చర్చ ఏంటి? కేటీఆర్ తర్వాత కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటున్నారు? తొలుత కేటీఆర్‌కే పగ్గాలు అందుకుంటారని నేతలు భావించారు. ఈలోగా కవిత తెరపైకి రావడానికి కారణాలేంటి? అధినేత ఆలోచన ప్రకారమే అంతా జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.

 

అధికారం పోయిన తర్వాత కారులో భారీగా కుదుపులు మొదలయ్యాయి. ఓ వైపు నేతలు వలసలు.. మరోవైపు లీడర్ షిప్ కోసం ఎత్తుకు పైఎత్తులు తీవ్రమయ్యాయి. కాంగ్రెస్ సర్కార్‌ని ఎదుర్కోవాలంటే కేటీఆర్ బెటరని భావించారు పెద్దాయన.

 

కేటీఆర్ రంగంలోకి దిగేశారు.. ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూపించే ప్రయత్నం చేశారు. ఈలోగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరు వచ్చినట్టు ప్రచారం సాగింది. అదే క్రమంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మెడకు చుట్టుకోవడం, ఆపై కేసు నమోదు కావడం జరిగిపోయింది.

 

ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయమంటూ ప్రచారం సాగింది. ఒకవేళ కేటీఆర్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టాలనే దానిపై కేసీఆర్ మల్లగుల్లాలు పడ్డారట. హరీష్‌రావుకి పగ్గాలు అప్పగించేందుకు కేటీఆర్, కవిత మొగ్గు చూలేదని గుసగుసలు.

 

పార్టీ పగ్గాలు కొద్దిరోజులపాటు కవితకు ఇస్తే బెటరని కేటీఆర్, కేసీఆర్ చర్చించుకున్నా రట. ఆ తర్వాత ఆమె పేరు తెరపైకి రావడం, ఆపై తెలంగాణ జాగృతి సభ్యులతో సమావేశం కావడం చకచకా జరిగిపోయాయి. జరుగుతున్న పరిణామాలను హరీష్‌రావు వర్గీయులు గమనిస్తున్నారు.