ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూట్టునే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే ‘పుష్ప-2’ సినిమాను ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. బీజేపీ సైతం ‘పుష్ప-2’ విమర్శలు గుప్పించింది. తాజాగా సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమాలో చూపించిందింతా కూడా ఫేక్ అని బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తేల్చేశారు.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ను అరెస్టు చేసి జైలులో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా పలుచోట్ల ‘పుష్ప-2’ సినిమా పోస్టర్లను చించివేయడం సంచలనంగా మారింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో కూడా ‘పుష్ప-2’ సినిమా పోస్టర్లను చించివేయడం కలకలం రేపింది. అయితే ‘పుష్ప-2’ పోస్టర్లు చించిందెవరన్న దానిపై బన్నీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. జనసేన కార్యకర్తలే ఆ పని చేసి ఉంటారని అల్లు అర్జున్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అల్లు అర్జున్ సినిమాకు వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు మాజీ సీఎం జగన్ అభిమానులు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన పుష్ప2 ఫ్లెక్సీలో మాజీ సిఎం జగన్, అల్లు అర్జున్ ఫొటోలు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మా కోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే అంటూ ఈ ఫ్లెక్సీలో క్యాప్షన్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఓవైపు కూటమి శ్రేణులు అల్లు అర్జున్ సినిమాకు వ్యతిరేకంగా ఉంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు ‘పుష్ప-2’ సినిమాకు అండగా నిలుస్తున్నారు.