రాజమౌళి (Rajamouli).. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించే ప్రతి సినిమా కూడా జాతీయస్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉండగా.. చివరిగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రం ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మెప్పు పొందింది. అంతేకాదు ఈ సినిమాలోని “నాటు నాటు” పాటకు ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా లభించింది. అలాంటి రాజమౌళి నుంచి వస్తున్న తదుపరి చిత్రం ‘ఎస్.ఎస్.ఎం.బి.29’. రాజమౌళి ,మహేష్ బాబు(Maheshbabu )కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే సినిమా ప్రకటించి దాదాపు ఏడాదికి పైగానే అవుతున్నా…ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అప్డేట్ వదలకపోవడంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ప్రముఖ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఇందులో హీరోయిన్ గా ఫైనల్ అయింది అంటూ వార్తలు వినిపించాయి. దీనికి తోడు హైదరాబాదులో బాలాజీ టెంపుల్ లో దర్శనమిచ్చిన ఈమె, మెగా కోడలు ఉపాసన(Upasana) కు థాంక్స్ చెప్పింది. దీంతో మెగా కోడలు అందరికీ కొత్త ఏడాది శుభవార్త చెబుతూ.. ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో దాదాపు కన్ఫామ్ చేసేసింది. అయితే ఇప్పుడు తాజాగా రాజమౌళి షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్.కి.. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ఇద్దరూ రిప్లై ఇవ్వడంతో ఇక అందరూ కన్ఫామ్ అయిపోయారు.
మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న..
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి అద్భుతమైన అప్డేట్ వదిలారు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న బోనులో బందీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్నాళ్లపాటు ఆయన హ్యాండ్ ఓవర్లోనే మహేష్ బాబు ఉండాలి. అందుకే ఆయన పాస్ పోర్ట్ లాగేసుకొని, ఇక నో మోర్ వెకేషన్ అన్నట్లు ఒక వీడియోని జక్కన్న షేర్ చేశారు.
ఆ వీడియోలో ఏముంది అనే విషయానికొస్తే.. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా (Seize the lion) ఆ వీడియో ఉంది. సింహాన్ని లాక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చారు జక్కన్న. దీంతో ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ షురూ అయిందని, ఇక మహేష్ బాబుకి అబ్రాడ్ వెకేషన్స్ లేవని స్పష్టం అవుతోంది.
రాజమౌళి పోస్ట్ కి రిప్లై ఇచ్చిన మహేష్ బాబు , ప్రియాంక..
దీనికి తోడు రాజమౌళి షేర్ చేసిన ఈ వీడియో కింద మహేష్ బాబు కూడా స్పందించారు.” ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అంటూ రిప్లై ఇచ్చారు. అటు దీనిపై ప్రియాంక చోప్రా, నమ్రతా (Namratha) కూడా స్పందించారు. మొత్తానికైతే ఎస్ ఎస్ ఎన్ బి 29 అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఇది అతి పెద్ద అప్డేట్ అని చెప్పవచ్చు. మొత్తానికైతే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తదుపరి అప్డేట్ల కోసం అప్పుడే ఎదురు చూడటం మొదలుపెట్టారు.
SSMB -29..
ఈ సినిమా విషయానికి వస్తే..రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చాలా ఘనంగా పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభం అయింది.