భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ స్వార్థం కోసం పార్టీలు ఓటర్లపై ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో నోటి ఏది వస్తే అది ఉచిత వాగ్ధానాలు చేస్తున్నారు. ప్రజల పని చేయడానికి ఇష్టం లేకుండా పార్టీలు చేస్తున్నాయి. ఏ పని చేయకుండానే ఆహారం, అకౌంట్లలో డబ్బులు వేస్తామని హామీలు ఇస్తున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మహిళలకు అకౌంట్లలో డబ్బుల వేస్తాం, ఉచిత బస్సు సౌకర్యం అందజేస్తాం.. ఇలా నోటికి వచ్చినట్లు రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేస్తున్నారు. తీరా ప్రజలను పని చేయకుండా చేస్తున్నారు.
ఇదే అంశం పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పట్టణాల్లో నివసించే ప్రజలకు ఆశ్రయం కల్పించాలని పేర్కొంది. దీనిపై దాఖలైన పిటిషన్ పై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ బీఆర్ గవాయి లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫ్రీగా అకౌంట్లలో డబ్బులు, ఉచిత రేషన్ అందజేస్తే ప్రజలు పని చేయడనాకి ఇష్టం చూపరని ధర్మాసనం హెచ్చరించింది. రాజకీయ నాయకులు, పార్టీలు ఉచిత వాగ్ధానాలు అమలు చేయడం వల్ల ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొంది. ఈ ఉచితాలు అమలు చేయడంతో ప్రజలను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్న జీవులులగా మారుస్తున్నారని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉచితాలు ప్రకటించడం ల్ల ప్రజలు పని చేయడానికి మొగ్గు చూపడం లేదని.. ఈ పరిణామం వల్ల దేశాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజల కోసం ఆలోచిస్తున్నందకు అభినందలు తెలియ జేస్తున్నాం.. కానీ వారిని అభివృద్ధిలో భాగం చేస్తే మంచిదని తెలిపింది. ప్రజలను దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు, నేతలు ఉచితాలను ప్రకటించే పద్ధతి ఏ మాత్రం సరికాదని పేర్కొంది. ఉచితాలు ప్రజలకు ఏ మాత్రం సరికావు. కేవలం.. వీటి కారణంగానే కొంత మంది పని చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎలాంటి పని చేయకపోవడం వల్లే దేశంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని వివరించింది. ఉచిత స్కీం లను అమలు చేయడం బదులుగా వారికి పనిలో నైపుణ్యం నేర్పించి ఉద్యోగం లాంటివి కల్పిస్తే బాగుంటుందని తెలిపింది. ఇది దేశ అభివృద్ధి దోహదం చేస్తుందని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ తో కూడిన ధర్మాసనం చెప్పుకొచ్చింది.
కేంద్ర పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ను పూర్తి చేసే పనిలో పడిందని.. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఇతర సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు యోచిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణ, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనానికి తెలిపారు. దీని పై న్యాయస్ధానం స్పందించింది. ఈ నిర్మూలన మిషన్ ఎంత కాలం పని చేస్తుందో తెలియ జేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.