AP

జేసీ ప్రభాకర్ రెడ్డి పై నేత కేసు – కూటమిలో రచ్చ..!

టీడీపీ సీనియర్ నేత జీసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదైంది. సినీ నటీ.. బీజేపీ నేత మాధవీ లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసారు. తనను కించపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసార ని మాధవీ లత ఫిర్యాదు చేసారు. జేసీ మద్దతు దారుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు లో పేర్కొన్నారు. జేసీ నుంచి ప్రాణ హాని ఉందని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న ఈ రెండు పార్టీల నేతల వివాదం ఇప్పుడు కూటమిలో రచ్చగా మారుతోంది.

 

జేసీ పై కేసు

టీడీపీ నేత.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పై సైబరాబాద్ లో కేసు నమోదైంది. సినీ నటి మాధవీ లత పైన కొత్త సంవత్సర వేడుకల వివాదం వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసారు. దీని పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కాగా, జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని.. ఆయన మద్దతు దారులు తనను తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ మాధవీ లత పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. గత నెలలో జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకల ను తాడిపత్రిలో నిర్వహణ పైన వివాదం మొదలైంది. జేసీ ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడులకు వెళ్ల వద్దని మాధవీ లత చేసిన వ్యాఖ్యలకు ఈ వివాదానికి కారణమయ్యాయి.

 

మాధవీ లత ఫిర్యాదు

తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్‌ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు నిర్వహిం చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసారు. కాగా, ఈ వేడులకు మహిళలు ఎవరూ వెళ్లవద్దంటూ మాధవీ లత వీడియో సందేశం ఇచ్చారు. తాడిపత్రికి వెళ్తే అక్కడ మహిళల రక్షణకు ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పైన జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాధవీ లత లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో మాధవీ లత పైన టీడీపీ మహిళా కౌన్సిలర్లు స్థానికంగా ఫిర్యాదు చేసారు. జేసీ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. జేసీ పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేసారు.

 

కేసు నమోదుతో

దీంతో, జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణలు చెప్పారు. తాను ఆవేశంలో వ్యాఖ్యలు చేసానని.. ఉద్దేశ పూర్వకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అయితే, తన పైన జేసీ చేసిన వ్యాఖ్యల పై మాధవీ లత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటుగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసారు. ఈ వివాదం సమిసి పోతుందని భావిస్తున్న వేళ ఇప్పుడు మాధవీ లత ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయటం తో మరోసారి కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు టీడీపీ నుంచి ఈ వ్యవహారంలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.