ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాకు ఎన్ఐఏ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది. రాణాను గత రాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ వాదనలు వినిపించారు.
రాణా తరపున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది పీయూష్ సచ్‌దేవా వాదించారు. రాణాను తమకు 20 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఎన్ఐఏ కోరింది. వాదనల అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్‌జీత్ సింగ్ 18 రోజుల కస్టడీకి అనుమతించారు.