కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహమే ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కో తప్పుకు ఒక్కో కొరడా దెబ్బ అంటే.. కేసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాలని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లను తరలించుకుపోతే.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోతాయి.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు అన్న కేసీఆర్.. రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టు తీసేసిండు.. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఏం అన్యాయం చేశారు..? ఆనాడు ఎకరానికి రూ.93వేల ఖర్చుతో నీళ్లిచ్చాం.. కానీ కేసీఆర్ ఎకరాకు రూ.11.5లక్షలు ఖర్చు చేశాడు’ అని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు అయిన పూర్తి చేశారా..? అందరి కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కేసీఆర్ కుటుంబమే సాగునీటి, ఆర్థిక శాఖలను చూసుకుంది ఆ సమయంలో.. తెలంగాణ సర్వం నాశం అయింది ఈ ప్రభుత్వంలోనే అన్నట్టుగా.. బీఆర్ఎస్ నేతలు వితండవాదం చేస్తున్నారు.. కేటీఆర్ పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు.. మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్ కు లేదు. తెలంగాణలో ప్రవేశించిన కృష్ణా నది జలాలను వెంటనే.. పాలమూరుకు తరలిస్తే మంచిగా ఉండేది.. దీనిపై చిన్నారెడ్డి ప్రశ్నిస్తే ఆనాడు అవమానకరంగా మాట్లాడారు.. కేసీఆర్ అనాలోచితంగా చేసిన నిర్ణయాలతో.. పాలమూరు ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాశాడు’ అని వ్యాఖ్యానించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.. సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే.. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహం ఎక్కువ. ఆయన చేసిన తప్పులకు వంద కోరడా దెబ్బలు కొట్టాలి. కేసీఆర్ ఏ డేట్ చెప్పినా సరే సభ నిర్వహిద్దాం. అవసరమైతే ఎక్స్ పర్ట్ ను పిలిపిద్దాం. ఎవరి గౌరవానికి భంగం కలిగకుండా సభ నిర్వహిద్దాం. ఇది సభా నాయకుడిగా నా మాట. అందరి కృషితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది’ అని చెప్పారు.
మా పాలసీ డాక్యుమెంట్ ను ముందు ఉంచుతాం. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. మీ కుటుంబలో ఏమైనా సమస్యలు ఉండే కులపెద్దను పెట్టి పంచాయితీని తేల్చుకోవాలి. ఆమె ఢిల్లీలో ఈయన గల్లీలో ఏంది ఈ పంచాయతీలు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం. నేను రావడానికి కూడా సిద్ధం. సీఎం కూడా చర్చలో పాల్గొనాలంటే వస్తాను. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి .. కృష్ణా, గోదావరి జలాలపై.. కేసీఆర్ తో చర్చకు సిద్ధమే. నేను వస్తాను కానీ.. క్లబ్ లకు, పబ్బులకు నేను దూరం.. మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటే హరీష్ రావు ఫోన్ చేసి.. మా మంత్రి శ్రీధర్ బాబును బెదిరిస్తున్నాడు’ అని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరద జలాలను తీసుకెళ్తామని అంటున్నారు. వరద జలాల్లో కూడా రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. ఫస్ట్ మా ప్రాజెక్టులు నిర్మించుకుంటే తర్వాత తెలుస్తుంది కదా.. కాళేశ్వరం కూలింది కాబట్టి మీకు వరద జలాలు అనిపిస్తోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.