TELANGANA

నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి… వైరల్ గా మారిన ట్వీట్..

ఏపీలో సంచలనం రేకెత్తించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్నారు. గతంలో కేసు విచారణకు హాజరైన విజయసాయిని సిట్ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

 

భగవద్గీతలోని”కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!” శ్లోకాన్ని ఆయన ట్వీట్ చేశారు.

 

“కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు” అంటూ దాని అర్థాన్ని కూడా వివరించారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.